అక్షరటుడే, కామారెడ్డి: KTR | లింగంపేటలో (Lingampet) తలపెట్టిన బీఆర్ఎస్ ఆత్మగౌరవ సభ (BRS Athma gourava Sabha)లో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి బైపాస్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Former MLA Gampa Govardhan), బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌కు స్వాగతం పలికారు. కారులో నుంచే నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ అభివాదం చేశారు. అక్కడినుంచి కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ (R and B Guest House) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగిన కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు. కాసేపటికి కేటీఆర్ భారీ కాన్వాయి మధ్య లింగంపేటకు బయలుదేరారు.
KTR | లింగంపేటకు తరలిన బీఆర్ఎస్ నాయకులు
ఆత్మగౌరవ గర్జన సభలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు లింగంపేటకు తరలివెళ్లారు. బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ప్రజాలకు సభకు వెళ్లారు.