అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Students protest | విద్యార్థినుల సంరక్షణ బాధ్యతలు చూడాల్సిన ఓ వార్డెన్ దారితప్పారు. వారి ఫొటోలను అసభ్యకరంగా తీసి ఇతరులకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి Medchal-Malkajgiri జిల్లా ఘట్‌కేసర్ Ghatkesar పోలీస్‌స్టేషన్ పరిధిలోని అవుషాపూర్ వీబీఐటీ ఇంజినీరింగ్ VBIT Engineering college కళాశాలలో చోటు చేసుకుంది. కళాశాలకు చెందిన హాస్టల్ వార్డెన్ Hostel Warden తమ ఫొటోలను అసభ్యకరంగా తీసినట్లు విద్యార్థినులు ఆరోపించారు.
ఈ మేరకు శుక్రవారం కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. అమ్మాయిలు షార్ట్స్ వేసుకొని ఉండగా ఫొటోలు తీశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.