అక్షరటుడే, ఇందూరు: Government General Hospital | జీజీహెచ్‌లో పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. మంత్రులు సమీక్ష చేసినా.. కలెక్టర్ (Collector) స్థాయిలో అధికారులు తనిఖీలు చేసినా రోగులకు అవస్థలు తప్పట్లేదు.. వివరాల్లోకి వెళ్తే.. నవీపేటకు చెందిన సాయిలు అనే వ్యక్తికి మంగళవారం రాత్రి ప్రమాదం జరిగగా.. కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్‌సీకి (navipet PHC) తరలించి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు (GGH) తీసుకొచ్చారు. కాని వార్డుకు మాత్రం తరలింంచలేదు. సమయానికి వార్డ్బాయ్లు అందుబాటులో లేక రోగి బంధువులే సెలైన్ పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. తమకు సమాధానం చెప్పేవారే కరువయ్యారని వారు వాపోయారు.
