అక్షరటుడే, వెబ్డెస్క్ : CI suspended | తొమ్మిది ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తిపై పోలీసులు తాజాగా భూ కబ్జా Land grabbing కేసు నమోదు చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన సీఐ తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు మరణించిన వ్యక్తిని అందులో నిందితుడిగా చేర్చాడు. దీనిపై విచారించిన ఉన్నతాధికారులు ఆ సీఐని సస్పెండ్ ci suspend చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే.. వరంగల్ warangal పరిధిలోని ఏజే మిల్స్ AJ Mills పోలీస్ స్టేషన్లో Police Station జె వెంకట రత్నం సీఐగా పని చేస్తున్నారు. అయితే ఓ భూ వివాదం కేసులో ఆయన బాధితులకు న్యాయం చేయకుండా తప్పుడు కేసు పెట్టారు. అంతేగాకుండా ఆ కేసులో తొమ్మిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా చేర్చి నిందితులకు సహకరించాడు. మరో కేసులో మహిళా నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగికంగా వేధించాడు. ఈ మేరకు విచారణ జరిపిన వరంగల్ సీపీ warangal cp సదరు సీఐ వెంకట రత్నంను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
