అక్షరటుడే, వెబ్‌డెస్క్: artificial intelligence | కృత్రిమ మేధా(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు యుద్ధ రంగాన్ని కూడా మార్చేశాయి. ప్రధానంగా ఐఏ(AI)తో శత్రువులను గుర్తించడం, వారిని మట్టుబెట్టడం మరింత సులువుగా మారింది. హమాస్(Hamas)పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్(Israel) కృత్రిమ మేధ(artificial intelligence)తోనే అనేక టార్గెట్లను ఛేదించింది. అయితే, ఏఐ వినియోగంతో కొన్ని పొరపాట్లు కూడా జరిగి సామాన్యులు మృతి చెందారు.
డ్రోన్ టార్గెటింగ్(Drone targeting) నుంచి ముఖ గుర్తింపు వరకు ఇజ్రాయిల్ యుద్ధంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం సమకాలీన పోరాట కార్యకలాపాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది, అయితే పౌర రక్షణతో పాటు యాంత్రీక నిర్ణయాలు లోతైన నైతిక ప్రశ్నలను లేవనెత్తాయి
artificial intelligence | టార్గెట్‌ను కొట్టబోయి పౌరులపైకి..
గాజా భూగర్భ సొరంగాల్లో దాగి ఉన్న హమాస్ అగ్ర కమాండర్ ఇబ్రహీం బియారీని గుర్తించేందుకు గాను ఇజ్రాయిల్ 2023 చివరలో కృత్రిమ మేధాను వినియోగించింది. ఇజ్రాయిల్ కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఏఐ ఆధారిత ఆడియో సాధనాన్ని ఉపయోగించింది. ఒక దశాబ్దం క్రితం అభివృద్ధి చేసినప్పటికీ, నిజమైన పోరాటంలో ఉపయోగించని ఈ టెక్నాలజీని ఇజ్రాయిల్ దళాలు హమాస్‌పై యుద్ధం సందర్భంగా వినియోగించాయి. ఫలితంగా బియారీ ఫోన్ కాల్స్ ఆధారంగా అతడి జాడను పసిగట్టాయి. దీంతో అక్టోబర్ 31న వైమానిక దాడి చేసి ఇజ్రాయిల్ ఇబ్రహీంను అంతమొందించింది. అదే అదే సమయంలో 125 మందికి పైగా పౌరులు మరణించడం విషాదం నింపింది.
artificial intelligence | ప్రయోగశాలగా గాజా యుద్ధం
వివిధ ప్రయోగాత్మక ఏఐ సాంకేతికతలను వినియోగించడానికి ఇజ్రాయిల్ గాజా యుద్ధాన్ని ప్రత్యక్ష పరీక్షా వేదికగా ఎలా ఉపయోగించుకుందో చెప్పడానికి బియారీ హత్య ఉదాహరణ మాత్రమే. గాయపడిన లేదా దాగి ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నైషన్‌ను ఉపయోగించడం, దాని ద్వారా వైమానిక బాంబు దాడులకు ఆటోమేటెడ్ లక్ష్యాల గుర్తింపు, భద్రతా కమ్యూనికేషన్లను ఛేదించుకుంటూ వెల్లడం, సోషల్ మీడియా పోస్ట్‌లను స్కాన్ చేయగల అరబిక్-భాషా చాట్‌బాట్‌లు ఇలా ఎన్నింటినో ఇజ్రాయిల్ గాజా యుద్ధంలో వినియోగిస్తోంది. ఇందుకోసం 8,200 మందితో ఎలైట్ యూనిట్‌ను నిర్వహిస్తోంది.
artificial intelligence | నష్టాలు కూడా అనేకం..
ఏఐ టెక్నాలజీ ఇజ్రాయిల్ లక్ష్యం, నిఘా సామర్థ్యాలను బాగా వేగవంతం చేసినప్పటికీ, కొత్త వ్యవస్థలు కొన్నిసార్లు నష్టాలు కూడా తీసుకొచ్చాయని తేలింది. ఫేషియల్ రికగ్నైషన్ ద్వారా వ్యక్తుల గుర్తింపు, అరబిక్ మాండలికాలు, ఇతర యాసలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో జరిగే పొరపాట్లు దారణాలకు దారి తీస్తాయి. అనేక ప్రమాదాలు పొంచి ఉన్న ఏఐ వినియోగాన్ని ఇజ్రాయిల్ మినహా మరే దేశం ఇప్పటిదాకా యుద్ధక్షేత్రంలో వినియోగించలేదు. కానీ, ఇజ్రాయిల్ మాత్రం హసన్ నస్రల్లా వంటి ఉన్నత స్థాయి వ్యక్తులను నేలకూల్చడంలో ఏఐని వినియోగించి విజయం సాధించింది. మొత్తంగా ఆధునిక యుద్ధ కాలంలో కృత్రిమ మేధ బహుళ పాత్ర పోషిస్తోంది.
1 comment
[…] వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కూడా ఒక కీలక పాత్ర […]
Comments are closed.