Homeబిజినెస్​Stock Market | వీడిన యుద్ధ భయాలు.. లాభాల్లో మార్కెట్లు

Stock Market | వీడిన యుద్ధ భయాలు.. లాభాల్లో మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Stock Market | ఇరాన్‌, ఇజ్రాయిల్‌(Iran, Israel) మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్‌ మార్కెట్లు పాజిటివ్‌గా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 393 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. అక్కడినుంచి మరో 227 పాయింట్లు పెరిగింది. 106 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడే(Intraday)లో మరో 70 పాయిట్లు లాభపడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 533 పాయింట్ల లాభంతో 82,588 వద్ద, నిఫ్టీ(Nifty) 149 పాయింట్ల లాభంతో 25,194 వద్ద కొనసాగుతున్నాయి.

Stock Market | మార్కెట్లలో ర్యాలీకి కారణాలు..

సీజ్‌ ఫైర్‌(Ceasefire) ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వచ్చిన వార్తలను ఇరాన్‌ మీడియా ఖండించింది. ఒప్పందం తర్వాత ఇరు దేశాలనుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోవడంతో మిడిల్‌ ఈస్ట్‌(Middle east)లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్నారు. చమురు ధరలు దిగివస్తుండడం, రూపాయి(Rupee) విలువ బలపడుతుండడంతో ఇన్వెస్టర్లలో మన మార్కెట్లపై సానుకూలంగా ఉన్నారు.
జూలై 9వ తేదీ సమీపిస్తున్నా అమెరికాతో వాణిజ్య ఒప్పందం(Trade agreement) విషయంలో ఇంకా చిక్కుముడులు విడిపోలేదు. మక్క, గోధుమ, పాడి దిగుమతుల విషయంలో అమెరికా డిమాండ్లను భారత్‌(Bharath) వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్‌ డీల్‌ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతవరకు ఇన్వెస్టర్లు మద్దతు స్థాయిల వద్ద కొనుగోలు చేస్తూ గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని అనలిస్టులు భావిస్తున్నారు.

Stock Market | అన్ని రంగాల్లో ర్యాలీ..

అన్ని రంగాల షేర్లు పరుగులు తీస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్‌ 1.15 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 1.06 శాతం పెరిగాయి. హెల్త్‌కేర్‌ 0.97 శాతం, సర్వీసెస్‌ 0.92, ఇన్‌ఫ్రా 0.91 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.90 శాతం లాభంతో ఉన్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.33 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.05 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.32 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.65 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.54 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

Top gainers:బీఎస్‌ఈలో 26 కంపెనీలు లాభాలతో, 4 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టైటాన్‌(Titan) 3.06 శాతం, టెక్‌ మహీంద్రా 1.61 శాతం, ఇన్ఫోసిస్‌ 1.60 శాతం, పవర్‌గ్రిడ్‌ 1.45 శాతం, రిలయన్స్‌(Reliance) 1.38 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers:బీఈఎల్‌(BEL) 1.58 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.79 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.28 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News