HomeUncategorizedJr. NTR | ఎన్టీఆర్ బ‌ర్త్​డేకి అదిరిపోయే ట్వీట్ రెడీ చేసిన హృతిక్.. ఈగర్​గా వెయిట్​...

Jr. NTR | ఎన్టీఆర్ బ‌ర్త్​డేకి అదిరిపోయే ట్వీట్ రెడీ చేసిన హృతిక్.. ఈగర్​గా వెయిట్​ చేస్తున్న ఫ్యాన్స్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jr. NTR | యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ NTR బ‌ర్త్ డే మే 20న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ బ‌ర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే మే 20న పుట్టిన రోజుని పురస్క‌రించుకొని ఆ రోజు క్రేజీ అప్‌డేట్స్ రానున్నాయి. తారక్‌ బర్త్ డేని మరింత స్పెషల్‌గా మార్చబోతున్నాడు హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan). అదిరిపోయే ట్రీట్‌ ప్లాన్‌ చేశాడట. తాజాగా హృతిక్‌ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి బాలీవుడ్‌లో వార్‌ 2 చిత్రం(War 2 Movie)లో నటించారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్​లో ఉంటుందట. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది.

Jr. NTR | క్రేజీ స‌ర్‌ప్రైజ్..

అయితే తాజాగా హృతిక్ రోష‌న్ Hrithik Roshan.. హేయ్ తారక్ నీ పుట్టిన రోజుకు నీ పుట్టిన రోజున నువ్వు ఊహించనిది రెడీగా ఉంది. అంటూ హృతిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) అంచనాలు ఆకాశానికి చేరాయి. వార్ 2 నుంచి ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఈగర్​గా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున సోషల్ మీడియాను షేక్ చేయడానికి అభిమానులు రెడీ అవుతుండ‌గా, ఆ రోజు దేవర 2, డ్రాగన్ మూవీ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే వార్ 2లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంద‌ని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘వార్’ సినిమాకు War ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. మళ్లీ ‘రా ఏజెంట్ కబీర్ ధాలివాల్’ పాత్రలో హృతిక్ మెరవనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ పాత్ర(NTR villain role)లో కీలకంగా కనిపించనున్నట్లు సమాచారం. మే 20న ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీ నుంచి సాలిడ్ ట్రీట్ అభిమానుల కోసం సిద్ధంగా ఉంది. అయితే హృతిక్ ట్వీట్‌కి ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. క‌బీర్ కోసం కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వార్‌ 2 ఆగస్ట్ 14న విడుదల కానుంది.