అక్షరటుడే, వెబ్‌డెస్క్: Waqf is not a fundamental right : వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావన అయినప్పటికీ, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని, అందువల్ల రాజ్యాంగం ప్రకారం దానిని ప్రాథమిక హక్కు(fundamental right under the Constitution)గా భావించలేమని కేంద్రం స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టం-2025(Waqf Amendment Act-2025) రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కూడా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే(Islamic concept) గానీ, ఇది ఇస్లాంలో కీలక భాగం కాదని తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(Chief Justice BR Gavai), జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్(Justice Augustine George Masih) ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే గానీ ఇస్లాంలో కీలక భాగం కాదన్నారు. వక్ఫ్ అనేది ప్రాథమిక హక్కు కాదన్నారు.
Waqf is not a fundamental right : ఆస్తుల సంరక్షణ కేంద్రం బాధ్యత
దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను, వాళ్ల ఆస్తుల్ని సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తుషార్ మెహతా స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను అక్రమంగా పక్కదారి పట్టించే ప్రయత్నాలను సర్కారు చూస్తూ ఊరుకోదన్నారు. వక్ఫ్ చట్టంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఉన్నది సేవ కోసమేనని స్పష్టం చేశారు.
వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు ఉంటే వచ్చే నష్టం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇందులో మతపరమైన అంశాల జోక్యమేమీ లేదన్నారు. వక్ఫ్ చట్టం సవరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏకంగా 96 లక్షల మంది ముస్లింల అభిప్రాయాలను సేకరించిందని తెలిపారు. చర్చోపచర్చల తర్వాత అందరి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని కేంద్రం చట్టాన్ని సవరించిందన్నారు.