అక్షరటుడే, ఎల్లారెడ్డి: Urea Shortage | ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోరత (Urea Shortage) రైతుల మధ్య చిచ్చు పెడుతోంది. నిత్యం రైతులు సొసైటీల వద్ద రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా (urea bag) కోసం రేయింబవళ్లు సొసైటీల దగ్గర పడిగాపులు కాస్తున్నారు.
కిలోమీటర్ల పొడవునా క్యూలు కట్టాల్సి వచ్చినప్పటికీ వారికి సరిపడినంత యూరియా దొరికడం లేదు. దీంతో క్యూలో నిలబడ్డ రైతుల మధ్యే తగాదాలు జరుగుతున్నాయి. క్యూ లైన్లలో గొడవలు పడే పరిస్థితి ఏర్పడుతుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Urea Shortage | పోలీస్‌స్టేషన్ గడప తొక్కాల్సిందే..
ఉమ్మడి జిల్లాలో చాలా సొసైటీల (societies) వద్ద రైతులు బారులు తీరుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో యూరియా పంపిణీ సెంటర్ల (urea distribution centers) వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. పోలీసులే దగ్గరుండి టోకెన్లు ఇస్తూ రైతులను అదుపు చేయాల్సి పరిస్థితి వస్తోంది.
Urea Shortage | బీబీపేట మండలంలో..
తాజాగా కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండల (Bibipet mandal) కేంద్రంలోని సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులుతీరారు. అయితే రావాల్సినంత యూరియా బస్తాలు రాకపోవడంతో సొసైటీ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో సొసైటీ సిబ్బందికి (society staff) రైతులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను కట్టడి చేయలేక సొసైటీ సిబ్బంది పోలీసులను సంప్రదించాల్సి వచ్చింది.
Urea Shortage | పోలీస్‌స్టేషన్‌లో రైతులను కూర్చోబెట్టి..
రైతులు, సొసైటీ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుండడంతో పోలీసులు స్పందించారు. రైతులను పోలీస్ స్టేషన్‌కు (police station) తరలించారు. కేవలం 600 బస్తాలు మాత్రమే సొసైటీకి రావడంతో ఎవరికి యూరియా ఇవ్వాలో తెలియక పోలీసులు రైతులందరికీ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టి యూరియా బస్తాలకు టోకెన్లు ఇచ్చారు.
Urea Shortage | యూరియా కోసం ఇన్ని తిప్పలా..
రాష్ట్రంలో యూరియా కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి బీబీపేట రైతులకు దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు సరిపడా యూరియా వచ్చినట్లయితే ఇన్ని పాట్లు తమకు అవసరమా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం (government) వెంటనే రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.