More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | పెంపుడు కుక్కలతో వాకథాన్​

    Hyderabad | పెంపుడు కుక్కలతో వాకథాన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | దేశంలో మొదటి సాంకేతిక ఆధారిత ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ, జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ (Jigli Experience Center) వాకథాన్​ నిర్వహించింది.

    పెంపుడు జంతువుల యజమానులు, వారి ఫర్రి స్నేహితులను ఒకచోట చేర్చే ఉత్తేజకరమైన వాకథాన్‌ను (walkathon) తీసుకురావడం ద్వారా ఫిట్‌నెస్, పెంపుడు జంతువుల యాజమాన్యం ఆనందాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొంది. ఈ వాకథాన్ ఉదయం 7 గంటలకు రిజిస్ట్రేషన్, కిట్ పంపిణీతో (registration and kit distribution) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెంపుడు జంతువులు , వాటి యజమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వాకథాన్​లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.

    హైదరాబాద్‌లోని పెంపుడు జంతువుల యజమానుల ప్రేమ , మద్దతు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని నిర్వాహకులు తెలిపారు. జంతు సంక్షేమం మహోన్నత లక్ష్యానికి మద్దతు ఇవ్వడంపై మా అచంచలమైన నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. జిగ్లీ వాకథాన్ పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య విడదీయరాని బంధానికి ఒక ఉత్సాహభరితమైన వేడుక అని కాస్మో ఫస్ట్ గ్రూప్ సీఈవో పంకజ్ పోద్దార్ అన్నారు. వాకథాన్​ ద్వారా రూ.లక్ష నిధులు సేకరించినట్లు తెలిపారు. వీటిని జంతువుల సంక్షేమ (animal welfare) కార్యక్రమాల కోసం జిగ్లీ ఫౌండేషన్‌కు (Jigili Foundation) అందజేశారు.

    జిగ్లీ కమ్యూనిటీ నేతృత్వంలోని అనేక కార్యక్రమాలలో ఒకటైన వాకథాన్, పెంపుడు జంతువుల యజమానులను ఏకం చేయడం, అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం తమ లక్ష్యమని జిగ్లీ తెలిపింది. ఆహారం, గ్రూమింగ్ నుంచి పశువైద్య సేవల (veterinary services), ఉపకరణాల వరకు పెంపుడు జంతువుల అన్ని సంరక్షణ అవసరాలు జిగ్లీ దగ్గర దొరుకుతాయని పేర్కొంది.

    More like this

    Bihar Elections | మ‌హాఘ‌ట్ బంధ‌న్‌లో చీలిక‌?.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌న్న తేజ‌స్వీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపొందాల‌ని భావిస్తున్న విప‌క్ష...

    Congress | కాంగ్రెస్​ క్రమ శిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్​రెడ్డిపై ఏమన్నారంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీ భవన్​లో నిర్వహించారు....

    Asia Cup | భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత.. ట్రెండింగ్​లో బాయ్​కాట్​ హ్యాష్​ట్యాగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో భాగంగా జరగనున్న భారత్ - పాకిస్తాన్...