HomeజాతీయంVreels | ఇన్‌స్టాకు పోటీగా ‘వీరీల్స్‌’.. ఇది తెలుగువారి సృష్టి!

Vreels | ఇన్‌స్టాకు పోటీగా ‘వీరీల్స్‌’.. ఇది తెలుగువారి సృష్టి!

టిక్‌ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు పోటీగా మరో యాప్‌ దూసుకొచ్చింది. వీరీల్స్‌ (వర్చువల్లీ రిలాక్స్‌, ఎక్స్‌ ప్లోర్‌, ఎంగేజ్‌, లైవ్‌ అండ్‌ షేర్‌) పేరుతో వచ్చిన యాప్‌ గేమ్‌ చేంజింగ్‌ ప్లాట్‌ ఫామ్‌గా ఎదుగుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vreels | ఒకప్పుడు టిక్‌ టాక్‌ యాప్‌ (TikTok App) ఇండియాలో సంచలనం సృష్టించింది. చాలా మంది దీనిని వినియోగించేవారు. టిక్‌టాక్‌ రీల్స్‌తో పలువురు స్టార్లుగాను మారిపోయారు. తర్వాతి కాలంలో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించడంతో ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) వైపు మళ్లారు.

ప్రస్తుతం ఈ యాప్‌నకు పోటీ ఇచ్చేందుకు వీరీల్స్‌ (Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) దూసుకొస్తోంది. అమెరికాలో నివసించే తెలుగు ఇంజినీర్లే (Telugu Engineers) దీనిని సృష్టించారు. అమెరికా, భారత్‌తో సహా 22 దేశాల్లో విడుదలైన ఈ యాప్‌ ప్రస్తుతం బీటా దశలో ఉంది.

ఒకే వేదిక ద్వారా : మనం రోజూ ఎన్నో యాప్‌లు ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని చాటింగ్‌ (Chating) కోసం, ఇంకొన్ని వీడియోల కోసం, మరికొన్ని షాపింగ్‌ కోసం.. అయితే వీటినన్నింటిని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్‌ రూపొందించారు. వీరీల్స్‌లో రీల్స్‌ చూడడంతో పాటు చాటింగ్‌, ఫొటోల షేరింగ్‌ (Photos Sharing), స్టోరీస్‌ షేరింగ్‌ వంటి ఆప్షన్లున్నాయి. ఇందులో ప్రతి యూజర్‌ ఒక క్రియేటర్‌గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్‌ స్టోరీస్‌ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్‌, స్టిక్కర్లు, మ్యూజిక్‌ సపోర్ట్‌తో క్రియేటర్లకు మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది.

పిక్స్‌ పౌచెస్‌ : ఇందులో పిక్స్‌ పౌచెస్‌ (Pix Pouches) అనే ఫీచర్‌ ఉంది. ఇది డిజిటల్‌ నోట్‌బుక్‌ అన్నమాట. ఇష్టమైన ఫొటోలు లేదా ఆలోచనలను వర్గాల వారీగా ఇందులో స్టోర్‌ చేసుకోవచ్చు. స్నేహితులు, సన్నిహితులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్‌ చేయవచ్చు.

వీ కాప్సూల్‌ : ఇది భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్‌గా ఒక ‘క్యాప్సూల్‌’లో ఉంచి నిర్దిష్ట తేదీన దానిని ఓపెన్‌ చేసి చూసుకునే అవకాశాన్ని ఇస్తుంది. పుట్టినరోజు సందేశం, వార్షికోత్సవ శుభాకాంక్షలు లేదా వ్యక్తిగత మైలురాయి వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి వాటిని వీలైనప్పుడు చూసుకోవడం ద్వారా భావోద్వేగ క్షణాలను తిరిగి పొందవచ్చన్న మాట.

ఇతర ఫీచర్లు : ‘వీ మ్యాప్‌’ (V Map) ఫీచర్‌ వినియోగదారులు తమ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో కనుగొనడంలో సహాయపడుతుంది. లొకేషన్‌ షేరింగ్‌ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.

వీరీల్స్‌ షాప్‌/బిడ్‌ ఆప్షన్‌ త్వరలో రాబోతోంది. ఇది అందుబాటులోకి వస్తే వీరీల్స్‌ (Vreels) ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ కూడా చేయవచ్చు. వీరీల్స్‌ షాప్‌ ఆప్షన్‌ ద్వారా వస్తువులను అమ్మడం, కొనడం చేయవచ్చు.
టోకెన్‌ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌, యూజర్‌ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు ఉన్నాయి. యూజర్‌ పోస్టులు, ప్రొఫైల్‌, లొకేషన్‌ను ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్‌ పరిధిలోనే ఉంటుంది. ఇవి యూజర్ల వ్యక్తిగత డాటాను కాపాడటానికి తోడ్పడతాయని భావిస్తున్నారు.