అక్షరటుడే, భీమ్గల్ : Minister Ponguleti | ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీవో)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో.. మంగళవారం మంత్రి పొంగులేటిని (Minister Ponguleti) వీఆర్ఏల సంఘం నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. రైతులకు గ్రామాల్లో అందుబాటులో ఉంటామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ సంఘం ప్రతినిధులు పృథ్వీరాజ్ సాయినాథ్, సంతు గంగాధర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.