అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat elections | కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చలి కారణంగా ఓటర్లు మందకొడిగా బయటకు వస్తున్నారు. చిన్న గ్రామపంచాయతీల్లో చంటి పిల్లలతో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు 25 శాతం పోలింగ్ పోలింగ్ నమోదైంది. ఎండ వేడి పెరగడంతో ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఓటు వేయడానికి క్యూ కడుతున్నారు. మరోవైపు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు అనేక పాట్లు పడుతున్నారు. వలస ఓటర్లు సైతం టూరిస్ట్ వాహనాల్లో తీసుకొస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరగనుండడంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు స్థానికంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు ఓటర్లను త్వరగా వెళ్లి ఓటు వేయాలని కోరుతున్నారు. పోలింగ్ కేంద్రాలను (polling stations) ఎల్లారెడ్డి డీఎల్పివో సురేందర్, డీఎస్పీ శ్రీనివాసరావు, తహశీల్దార్ ప్రేమ్, పరిశీలిస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పోలింగ్ కేంద్రం మద్ద సైతం ఎలాంటి ఆందోళనలు జరగకుండా భారీ బందోబస్తు చేపట్టినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ తెలిపారు. లక్ష్మాపూర్ పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.


