అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Eatala Rajendar | మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajendar) కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (Medchal Malkajgiri district) ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులకు శాలువా కప్పి, వీర తిలకం దిద్దారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అన్ని పార్టీల వారిని చూశామని, ఈ సారి బీజేపీ వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. హైదరాబాదులో (Hyderabad) ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేక పోతుందని విమర్శించారు. వేలకోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాను నేను ఎంపీ అయిన తర్వాత మల్కాజిగిరిలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం మొదలుపెట్టినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేదన్నారు. వారికి ఓటు వేసిన చేసేదేమీ లేదని పేర్కొన్నారు. పట్టణాలలో అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమని తెలిపారు.
MP Eatala Rajendar | హామీల అమలులో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) హామీల అమలులో విఫలమైందని ఈటల విమర్శించారు. ఆడ బిడ్డకి రూ2,500, పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. మాటలు కోటలు దాటాయి కానీ కాళ్లు మాత్రం తంగెళ్లు దాటడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగుల బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లు పనిచేస్తే బిల్లులు రావడం లేదన్నారు.