అక్షరటుడే, ఆర్మూర్: Armoor Muncipality | పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో (municipal office) గురువారం మున్సిపల్ పట్టణ ఏకీకృత జాబితాను విడుదల చేశారు. మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి (Municipal Commissioner Pujari Shravani) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Armoor Muncipality | అభ్యంతరాలుంటే..
ఈ సందర్భంగా ఓటర్ లిస్టును ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంతో (Armoor Municipality office) పాటు సబ్ కలెక్టర్, ఎంపీడీవో తహశీల్దార్ కార్యాలయాల నోటీస్బోర్డులపై ప్రదర్శిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఏమైనా తప్పులు, సవరణలు, మార్పలు చేర్పులు, తొలగింపులు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం అభ్యంతరాలు సమర్పించవచ్చని ఆమె సూచించారు.
ఈ అవకాశాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పౌరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆంజనేయులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.