అక్షరటుడే, ఇందూరు: Voter List Mapping | ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలు సరిపోలుస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రాజకీయ పార్టీలు ఏజెంట్‌ను నియమించుకొని మ్యాపింగ్ ప్రక్రియకు సహకారం అందించేలా కృషి చేయాలని తెలిపారు.
Voter List Mapping | ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జాప్యం
ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని ప్రస్తుతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.