186
అక్షరటుడే, ఇందూరు: voter draft list | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ముసాయిదాను ఇప్పటికే విడుదల చేశారు. దీనిపై మంగళవారం రాజకీయ నేతలతో నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి Collector Ila Tripathi సమావేశమయ్యారు.
voter draft list | ఓటరు జాబితాలో..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సమస్యను వివరించారు. ఓటరు జాబితాలో చాలా తప్పులు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో డివిజన్ వారీగా తమ పార్టీ నేతలు సర్వే నిర్వహించినట్లు వివరించారు. దీనిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తప్పులను సరిచేస్తామని హామీ ఇచ్చారు.