అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kagadala rally : ఓట్ చోర్ .. గద్దె చోడ్ అనే నినాదంతో జిల్లా యువజన కాంగ్రెస్(Youth Congress) ఆధ్వర్యంలో గురువారం (ఆగస్టు 14) సాయంత్రం నిజామాబాద్ లో కాగడాల ర్యాలీ నిర్వహించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువజన కాంగ్రెస్ నాయకులు కాగడాలు చేతబట్టి రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ కి మద్దతు ప్రకటించారు.
Kagadala rally : ఎన్నికల సంఘంతో కలిసి కుట్ర పన్నారని..
పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ మెంబర్ జీవీ రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కలిసి కుట్ర చేసిందని ఆరోపించారు.
దీనిని రాహుల్ గాంధీ బయటపెట్టడంతో బీజేపీ నీచబుద్ధి దేశ ప్రజలకు అర్థమైందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను బీజేపీ కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.
బీజేపీ(BJP) ఓట్ల దొంగతనం భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసిందని వారు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ బయటపెట్టిన అతిపెద్ద ఓటు కుంభకోణం బీజేపీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందనడానికి ఉదాహరణగా వారు చెప్పుకొచ్చారు.
పారదర్శకంగా ఎన్నికలు జరిగితే 2024 లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండేదని, ఏది ఏమైనా 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడాన్ని ఎవరూ ఆపలేరని వారు జోష్యం చెప్పారు.
కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబూద్ హందాన్, జెండా బాలాజీ ఆలయ కమిటీ ఛైర్మన్ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేవతి పోల ఉష, అపర్ణ, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అద్నాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, నయీమ్, యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షులు మోయిన్, ఆకుల మహేందర్, మనోహర్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.