vote-for-note case | ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు Supreme Court తీర్పును రిజర్వ్ చేసింది. ఓటుకు నోటు కేసులో ఏ4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం Telangana government ఆశ్రయించింది.
ప్రాథమిక దశలోనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయడం వల్ల విచారణపై ప్రభావం పడుతుందని.. మత్తయ్య (Matthayya) ను విచారించేందుకు అనుమతి కావాలని 9 ఏళ్లుగా తాము సుప్రీంకోర్టును కోరుతున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
vote-for-note case | సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేరు..
కాగా, మత్తయ్య సీన్ ఆఫ్ అఫెన్స్‌లో లేరు.. ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), A1, A2, A3 ఉన్నారు.. ఇవన్నీ పరిశీలించే హైకోర్టు మత్తయ్యపై ఎఫ్ఐఆర్ FIR కొట్టేసిందని అతని తరఫు న్యాయవాది కోర్టులో వివరించారు. ఇరు వైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.