అక్షరటుడే, వెబ్డెస్క్: Italy | ఇటలీలో అగ్ని పర్వతం బద్దలైంది. సిసిలీ(Sicily) తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం(Mount Etna volcano) ఒక్కసారిగా విస్పోటనం సంభవించింది. మంచుతో కప్పబడి ఉండే ఈ పర్వతం.. ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. అయితే ఒక్కసారిగా అగ్ని పర్వతం పేలడంతో పర్యాటకులు(Tourists) భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పేలుడు ధాటికి భారీగా బూడిద ఎగిసి పడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని పర్వతం నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడున్నట్లు తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బూడిద ఎగిసిపడుతుండడంతో.. మరిన్ని విస్పోటనాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.