అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడిరది. ఉదయం సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 280 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 542 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 54 పాయింట్ల నష్టంతో మొదలై మరో 38 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి 176 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 78 పాయింట్ల నష్టంతో 84,481 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 25,815 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,629 కంపెనీలు లాభపడగా 2,509 స్టాక్స్ నష్టపోయాయి. 194 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 95 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 276 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
ఐటీలో దూకుడు..
ఐటీ సెక్టార్లో దూకుడు కొనసాగగా.. పవర్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్ఈలో క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 1.58 శాతం, ఐటీ ఇండెక్స్ 1.24 శాతం, సర్వీసెస్ 0.79 శాతం, మెటల్ 0.56 శాతం పెరిగాయి. పవర్ ఇండెక్స్ 1.01 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.81 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.80 శాతం, యుటిలిటీ 0.75 శాతం, ఇండస్ట్రియల్ 0.66 శాతం, ఆటో 0.54 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.48 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం లాభంతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం నష్టంతో ముగిశాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్ 1.94 శాతం, టెక్ మహీంద్రా 1.72 శాతం, ఇన్ఫోసిస్ 1.51 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.48 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.44 శాతం పెరిగాయి.
Top Losers : సన్‌ఫార్మా 2.74 శాతం, టాటా స్టీల్ 1.26 శాతం, పవర్‌గ్రిడ్ 1.15 శాతం, ఆసియా పెయింట్ 0.89 శాతం, ఎన్టీపీసీ 0.82 శాతం నష్టపోయాయి.