అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gandhari | గాంధారి మండల కేంద్రంలో వాయిస్ కాల్స్ (Voice Calls) అంశం ఓటర్లను గందరగోళానికి గురిచేసింది. దీంతో ‘గాంధారిలో వాయిస్ కాల్స్ కలకలం..’ శీర్షికతో ‘అక్షరటుడే’ (AksharaToday) కథనం ప్రచురించింది. మాజీ సర్పంచ్ భూమి కబ్జా చేశాడని, అనుమతుల పేరిట వసూళ్లు చేశారని వాయిస్ కాల్స్ రావడంతో గాంధారి ప్రజలు అయోమయానికి గురయ్యారు.
Gandhari | ఇలా కూడా కాల్స్ వస్తాయా..?
ఇలాంటి కాల్స్ కూడా వస్తాయా అని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ వాయిస్ కాల్స్ కారణంగా గందరగోళానికి గురువుతున్నారని పేర్కొంటూ ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కావడంతో.. అప్పటి నుంచి ఆ కాల్స్ ప్రజలకు రావడం నిలిచిపోయింది. అయితే ఈ వాయిస్ కాల్స్ ఎవరు చేయించారు.. దీని వెనక ఉన్నదెవరు అనే విషయం సస్పెన్స్‌గా మారింది. దీనిపై అధికారులు విచారణ చేపడతారో లేదో వేచి చూడాలి.