అక్షరటుడే, లింగంపేట: Fisheries Department | మండలంలోని బోనాల్ గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం మత్స్యకారులకు (fishermen) వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. మత్స్య సహకార జిల్లా అధికారి శ్రీపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో 58 మంది మత్స్యకారులకు వల విసరడం, లాగడం, ఈత కొట్టడం, తదితర నైపుణ్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు సంఘంగా ఏర్పడితే ప్రభుత్వం మత్స్యకారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మత్స్య సహకార జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ, డైరెక్టర్ బెస్త సాయిలు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్, మండలాధ్యక్షుడు సాయికుమార్, హనుమంతు, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.