అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vivo V50 5G elite | చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వివో భారతీయ మార్కెట్‌లో మరో మోడల్‌ను లాంచ్(Launch) చేసింది. వివో వీ50 ఎలైట్ పేరుతో ప్రీమియం స్పెసిఫికేషన్‌తో తీసుకువచ్చిన ఈ మోడల్ ద్వారా వివో టీడబ్ల్యూఎస్ 3ఈ మోడల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది. గతంలో లాంచ్ చేసిన వివో వీ50కి పలు అప్‌డేట్స్(Updates)ను ఎలైట్ మోడల్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. మూడేళ్లపాటు ఆపరేటింగ్ సిస్టమ్(OS) అప్‌డేట్స్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు తెలిపింది. అమెజాన్(Amazon)తోపాటు వివో రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లేమిటో తెలుసుకుందామా..
- Display: 6.77 ఇంచెస్ Full HD+ క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే. 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
- Processor: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్.
- Operating System: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15.
- Battery: 6000 ఎంఏహెచ్ బ్యాటరీ. 90 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
- Camera: డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వచ్చిన 50 ఎంపీ(విత్ ఓఐఎస్) ప్రధాన లెన్స్, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందువైపున 50 ఎంపీ కెమెరా ఉంది.
- Variant: ఈ మోడల్ ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 12Gb + 512 Gb ఫోన్ ధర రూ. 41,999. రోజ్ రెడ్ కలర్‌లో ఉంటుంది.
- Card offers: హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 1,500 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే ఆయా కార్డులపై రూ. 3 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.