అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vivo X200T 5G | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తన ప్రీమియం సెగ్మెంట్లో మరో మొబైల్‌ను తీసుకువచ్చింది. Vivo X200T పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్.. శక్తిమంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఐదేళ్ల పాటు ఓఎస్, ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ Flipkart, Vivo e-store తోపాటు రిటైల్ షాపుల్లో అందుబాటులో ఉంది. ధర, స్పెసిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
డిస్ప్లే..
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో తీసుకువచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ ఉంది.
సాఫ్ట్వేర్..
ఇందులో 3.73 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌ను అమర్చారు. ఆరిజన్వోస్ కలిగిన ఆండ్రాయిడ్ 16తో రానున్న ఈ మొబైల్‌కు ఐదేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
కెమెరా సెటప్..
వెనక వైపు ZEISS 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 50 ఎంపీ పెరిస్కోప్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌తో 4కె/60FPSతో వీడియోలు రికార్డు చేయవచ్చు.
బ్యాటరీ సామర్థ్యం..
6,200 mAh సామర్థ్యంతో రానున్న ఈ బ్యాటరీ 90w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 40w వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. 35 గంటల పాటు యూట్యూబ్ ప్లేబ్యాక్, 6 గంటల పాటు వీడియో రికార్డింగ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది.
వేరియంట్స్, ధర వివరాలు..
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో సీసైడ్ లిలక్, స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.59,999.
12 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర రూ.69,999.
కార్డ్ ఆఫర్స్..
హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 4 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
Filpkart axis bank, Filpkart SBI bank క్రెడిట్ కార్డులతో అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.