11
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vivo V70 5G Launch | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ కంపెనీ అయిన వీవో ప్రీమియం సెగ్మెంట్లో వీవో వీ70 పేరుతో మరో మోడల్‌ను తీసుకువస్తోంది. శక్తిమంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా ఫీచర్లతో దీనిని తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈనెల 19న భారత మార్కెట్లో దీనిని విడుదల చేయనుంది. ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంలలో లీక్ అయిన సమాచారం మేరకు ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండనున్నాయి.
- 6.59 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్న ఈ మోడల్.. హెచ్డీఆర్ 10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1260 * 2750 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
- 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఐపీ68 / ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
- స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 1,889,405 గా ఉంది.
- వెనకవైపు 50 మెగా పిక్సెల్ జెసిస్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 40 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని తెలుస్తోంది.
- ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో కలర్స్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
- 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 45,999, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999 ఉండే అవకాశాలు ఉన్నాయి.