HomeUncategorizedYS Sunitha | న్యాయం కోసం పోరాడాలి అన్నా సెక్యూరిటీ త‌ప్ప‌నిస‌రి అయింది.. వైఎస్ సునీత...

YS Sunitha | న్యాయం కోసం పోరాడాలి అన్నా సెక్యూరిటీ త‌ప్ప‌నిస‌రి అయింది.. వైఎస్ సునీత కామెంట్స్ వైర‌ల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Sunitha | కడప జిల్లా(Kadapa District) పులివెందులలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న ఉద్విగ్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత(YS Sunitha) స్పందించారు. ఈ సంఘటనలు తండ్రి హత్యను గుర్తు చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె కడప ఎస్పీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “వివేకానంద రెడ్డిని గొడ్డలి తో పొడిచి హత్య చేశారు. కానీ అప్పట్లో గుండెపోటుతో మరణించినట్లు ప్రచారం చేశారు. ఆ తర్వాత పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌(Crime Scene)ను పూర్తిగా తుడిచేశారు,” అని ఆరోపించారు.ఆ సమయంలో హత్యకు సంబంధించి ఒక లేఖ తయారుచేసి, దానిపై ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారనే అభియోగాలతో సంతకాలు చేయించారు. కానీ, ఆ లేఖపై తాను సంతకం పెట్టలేదని సునీత స్పష్టం చేశారు.

YS Sunitha | సునీత హాట్ కామెంట్స్..

“వివేకా హత్య సమయంలో ఆడిన డ్రామానే ఇప్పుడు జడ్పీ సీట్ల ఉపఎన్నికల్లోనూ జరుగుతోంది. అప్పట్లో టీడీపీ నేతలు హత్య చేశారని ప్రజలను నమ్మబలికారు. ఇప్పుడు మా బంధువు అయిన సురేశ్‌పై ఎంపీ అవినాశ్ రెడ్డి (Avinash Reddy) అనుచరులు దాడి చేయించారని అనుమానం ఉంది,” అంటూ ఆమె ఆరోపించారు. గత ఆరేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా, ఇంతవరకు హత్యకు పాల్పడిన వారెవరికీ శిక్ష పడలేదు. నిజాన్ని బయటకు తీసుకురావాలంటే భ‌యంగా ఉంది అని సునీత పేర్కొన్నారు. ఇప్పుడు మా కుటుంబంపైనే వివేకా హత్య చేయించారని బూటకపు ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రేపు నా నాన్న పుట్టినరోజు. కానీ నా తల్లి నన్ను పులివెందుల(Pulivendula)కు రాకూడదని అంటోంది. న్యాయాన్ని కోరుతున్న నేను సెక్యూరిటీతో తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది,” అంటూ వైఎస్ సునీత భావోద్వేగంగా చెప్పారు. వివేకా హత్యపై సునీత పోరాటం ఇంకా కొనసాగుతోంది. అయితే గతంలో జరిగిందాన్నే ఇప్పుడు మళ్లీ పునరావృతం చేస్తున్నారని ఆమె ఆరోపణలు తీవ్ర దుమారానికి దారి తీసే అవ‌కాశం క‌నిపిస్తుంది.

Must Read
Related News