అక్షరటుడే, ఎల్లారెడ్డి : Boxing Competitions | బాక్సింగ్‌లో ఎల్లారెడ్డి (Yellareddy) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి వివేక్ జాతీయస్థాయికి ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ నాగేశ్వరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు.
Boxing Competitions | రాష్ట్రస్థాయిలో..
రాష్ట్రస్థాయిలో బాక్సింగ్ (State-Level Boxing)లో గోల్డ్ మెడళ్లు సాధించిన వివేక్ తన ప్రతిభతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. చిన్నతనం నుంచి బాక్సింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడని.. బాక్సింగ్‌డే రోజైన శుక్రవారం మహారాష్ట్ర (Maharashtra) లో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నాడని ప్రిన్సిపాల్ వివరించారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ నిఖిల్, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్, సీనియర్ ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి, రామ్ కుమార్ విద్యార్థినిని అభినందించారు. విద్యార్థికి శిక్షణ ఇస్తున్నటువంటి అకాడమీ కోచ్ శ్రీకాంత్‌కు వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.