ePaper
More
    HomeతెలంగాణMinister Vivek | మంత్రిగా వివేక్ బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం ఏ ఫైల్​పై అంటే..

    Minister Vivek | మంత్రిగా వివేక్ బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం ఏ ఫైల్​పై అంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Minister Vivek | రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనుల – భూగర్భ శాఖ మంత్రిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. నేడు (జూన్ 18న) సెక్రటేరియట్ రెండో అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్​లో మంత్రిగా ఛార్జ్(Ministerial charge) తీసుకున్నారు.

    మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివేక్.. ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు(Advance Technology Centers)గా మార్చే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. మొత్తం 46 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసే రూ.2600 కోట్ల నిధుల దస్త్రంపై సంతకం చేశారు.

    అంతకుముందు మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా తన ఛాంబర్​లో మంత్రి వివేక్(Minister Vivek) ప్రత్యేక పూజలు చేశారు. సతీమణి సరోజతో కలిసి పూజాల్లో పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కోసం సచివాలయానికి వెళ్లిన మంత్రి వివేక్​కు ఆయన ఛాంబర్ ఎదుట పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వివేక్ బాధ్యతల స్వీకరణ వేడుకలో ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

    మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్​కు సహచర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao) శుభాకాంక్షలు తెలిపారు. వివేక్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.

    Latest articles

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక...

    More like this