24
అక్షరటుడే, బాన్సువాడ: Banswada DSP Vittal Reddy | బాన్సువాడ డీఎస్పీగా విఠల్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డీఎస్పీ సత్యనారాయణ(DSP Satyanarayana) హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో నల్గొండ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన విఠల్ రెడ్డి బదిలీపై బాన్సువాడకు వచ్చారు. కాగా.. ఇదివరకు పనిచేసిన సత్యనారాయణను బదిలీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారుల వద్ద ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇక్కడి నుంచి ఉన్నఫలంగా ట్రాన్స్ఫర్ చేసి విఠల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.