Homeజిల్లాలునిజామాబాద్​Mokshagundam Visvesvaraya | విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

Mokshagundam Visvesvaraya | విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Mokshagundam Visvesvaraya | నేటితరం విద్యార్థులు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ఉత్తమ ఇంజినీర్లుగా తయారు కావాలని సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) అన్నారు.

ఇంజినీర్స్‌ డే (Engineers’ Day) సందర్భగా సోమవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో (Polytechnic College) పూర్వ విద్యార్థుల సంఘం, పాలిటెక్నిక్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంజినీర్స్‌ డే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ.. విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు. విద్యార్థులు డ్రగ్స్​ తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ భారతి, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, సహా అధ్యక్షుడు కేఎల్వీ రమణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, వినోద్, మోహన్‌ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mokshagundam Visvesvaraya | పలువురికి సన్మానం..

ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీర్లయిన జి.గంగాధర్ డీఈ రిటైర్డ్, పి.వీరేశం ఏడీఈ రిటైర్డ్, రాజయ్య విశ్రాంత డిప్యూటీ ఈఈ పంచాయతీ రాజ్, రమణ విశ్రాంత డీఈఆర్డీలను సన్మానించారు. అలాగే పూర్వ విద్యార్థి వై.గణేష్ మాస్టర్ అథ్లెటిక్ రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినందుకు సన్మానించడం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాల టాపర్స్ అయిన ఆరుగురు విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, సర్టిఫికెట్లు, నగదు, బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ నుండి రూ. 10వేల చెక్కు సర్టిఫికెట్లు​ బహూకరించారు.