అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | సోమార్పేట్ (Somarpet) ఘటన బాధితులను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పరామర్శించారు. గాయపడిన వారిలో బిట్ల భారతి హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో (Yashoda Hospital) చికిత్స పొందుతుండగా.. బాలమణి వెల్నెస్ ఆస్పత్రిలో చేరారు. వారిని మంగళవారం కలిసి ఆర్థికసాయం అందజేశారు. ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
MLA Madan Mohan | మెరుగైన చికిత్స కోసం..
అనంతరం ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులకు కష్టకాలంలో అన్ని విధాలా సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమన్నారు. ఎస్పీ, డీఎస్పీతో మాట్లాడి విచారణ పారదర్శకంగా నిర్వహించాలని కోరామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకరిని రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.