ePaper
More
    HomeసినిమాVishwambhara | ‘విశ్వంభర’ గ్లింప్స్‌కి టైమ్‌ ఫిక్స్.. ఆ విష‌యం లీక్ చేసిన చిరంజీవి

    Vishwambhara | ‘విశ్వంభర’ గ్లింప్స్‌కి టైమ్‌ ఫిక్స్.. ఆ విష‌యం లీక్ చేసిన చిరంజీవి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. కొత్త సినిమాల అప్‌డేట్స్ కోసం ఎదురు చూసే రోజు. ఈసారి కూడా అభిమానులను నిరాశపరచకుండా, చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘బింబిసార’ సినిమాతో (Bimbisara Movie) గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వంభర’. చిరంజీవి కెరీర్‌లో మరో వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6 గంటల 6 నిమిషాల‌కి విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.

    Vishwambhara | బ‌ర్త్ డే అప్‌డేట్..

    ఈ గ్లింప్స్ చిరంజీవి పుట్టినరోజుకు (Chiranjeevi birthday) ఒక రోజు ముందు విడుదల అవుతున్నప్పటికీ, ఇది మెగా ఫ్యాన్స్‌కు పండగ స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్‌ మాదిరి గ్లింప్స్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిపోయినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్‌ కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌పై (Bollywood Actress Mouni Roy) ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఇక సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారన్నదే అభిమానులలో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో చిరు మాట్లాడుతూ మీ అంద‌రికి ఓ విష‌యం లీక్ చేస్తున్నాను. 2026 వేసవి సీజన్‌లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది అని తెలియ‌జేశారు.

    దర్శకుడు, నిర్మాతలు విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావించి, విజువల్ ఎఫెక్ట్స్ మరియు సీజీ వర్క్స్‌ కోసం సమయాన్ని తీసుకుంటున్నారని చిరంజీవి వెల్లడించారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్ర‌మే కాకుండా, పిల్లలు, యూత్‌ అందరికీ నచ్చే విధంగా సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘విశ్వంభర’లో చిరు సరసన త్రిష కథానాయికగా (Heroine Trisha) నటిస్తుండగా, ‘నా సామీ రంగ’ ఫేమ్ ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించనుండగా, సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.

    Latest articles

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...

    Jagadeesh Reddy | క‌మీష‌న్ల కోస‌మే యూరియా కొర‌త‌.. కాంగ్రెస్ చేత‌గానిత‌నంతోనే రైతుల‌కు క‌ష్టాలన్న జ‌గ‌దీష్‌రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jagadeesh Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వ చేత‌గానితనంతోనే యూరియా కొర‌త ఏర్ప‌డింద‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి...

    More like this