ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | వరంగల్ సభను విశ్వకర్మలు విజయవంతం చేయాలి

    Kamareddy | వరంగల్ సభను విశ్వకర్మలు విజయవంతం చేయాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | విశ్వకర్మల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన అభినందన సభను విజయవంతం చేయాలని అఖిల భారత విశ్వకర్మ పరిషత్ (All India Vishwakarma Parishad) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల చారి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో సభకు సంబంధించిన వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మల పనులకు సంబంధించి విద్యుత్ వినియోగాన్ని 10 హెచ్​పీ నుంచి 25 హెచ్​పీకి పెంచుతూ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth reddy) అభినందనలు తెలుపుతూ సభ నిర్వహిస్తున్నామన్నారు.

    ఈ సభకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు కొండా సురేఖ, సీతక్క, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ (Deputy Chairman of the Legislative Council Banda Prakash), రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఛైర్మన్ డా.జస్టిస్ దేవరాజు నాగార్జున, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్​ సీఎండీ వరుణ్ రెడ్డి(North Power Distribution CMD Varun Reddy), అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు రాచమల్ల పున్నమాచారి హాజరు కానున్నారన్నారు. సమావేశంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శన్, కంది నాగభూషణం, బెజ్జంకి రాజు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...