Homeజిల్లాలుకామారెడ్డిVishwakarma Jayanti | ఘనంగా విశ్వకర్మ జయంతి

Vishwakarma Jayanti | ఘనంగా విశ్వకర్మ జయంతి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Vishwakarma Jayanti | అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర జయంతిని (Vishwakarma Jayanti) ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి (Sriram Mahipal Chari) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు (Vishwabrahmans and Vishwakarmas) ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ చారి, కోశాధికారి బెజ్జారం నర్సయ్య చారి, సత్యప్రకాష్​, వివిధ సంఘాల నాయకులు విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులు పాల్గొన్నారు.

Vishwakarma Jayanti | లింగంపేటలో..

అక్షరటుడే, లింగంపేట: Vishwakarma Jayanti | మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జెండాను ఆవిష్కరించి యజ్ఞలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింగంపేటలో, భవానీ పేటలో (Lingampet and Bhavanipet) అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు కమ్మరి పండరి, మాజీ ఎంపీపీ వడ్ల భీమయ్య, వడ్ల రవికుమార్ నరహరి, ఏగొండ బ్రహ్మం, చంద్రశేఖర్, రామచందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News