Manchu Vishnu | మంచు విష్ణు ట్వీట్.. రాళ్ల‌తో కొడ‌తారంటూ నెటిజ‌న్స్ ఫైర్
Manchu Vishnu | మంచు విష్ణు ట్వీట్.. రాళ్ల‌తో కొడ‌తారంటూ నెటిజ‌న్స్ ఫైర్


అక్షరటుడే, వెబ్​డెస్క్:Manchu Vishnu | మంచు మోహ‌న్ బాబు manchu mohan babu, మంచు విష్ణు manchu vishnu, మంచు ల‌క్ష్మీ manchu lakshmi, మంచు మ‌నోజ్ Manchu manoj అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతుంటారు. ముఖ్యంగా మంచు విష్ణు(Manchu Vishnu) సోష‌ల్ మీడియాలో చేసే ట్వీట్స్ (Social Media Tweets) వివాదాల‌లో నిలుస్తుంటాయి.

తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ నెటిజ‌న్స్ కు ఆగ్ర‌హం తెప్పించింది. డైనమిక్ స్టార్ విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Knnappa)ను ఓ మైలు రాయి చిత్రంగా మలిచేందుకు శ‌తవిధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ను స్టడీ చేస్తూ గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ హిస్టారిక‌ల్ మూవీ ప్ర‌మోష‌న్స్ మే 8 నుండి ప్రారంభం కానున్నాయి. కన్నప్ప USA టూర్ మే 8న న్యూజెర్సీ(New Jersey)లో ప్రారంభం కానుంది. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్‌విక్‌లోని రీగల్ కామర్స్ సెంటర్‌లో అభిమానులతో ముచ్చటించనున్నారు.

Manchu Vishnu | అలా అన్నారేంటి?

మే 9న డల్లాస్‌కు Dallas బయలుదేరి వెళ్లి సాయంత్రం 7 గంటలకు గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్‌స్కేప్, ది కాలనీ, టెక్సాస్ లో ప్రేక్షకులతో సందడి చేయనున్నారు. ఈ పర్యటన మే 10న శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముగుస్తుంది. అక్కడ ఆయన ఉదయం 10:30 గంటలకు సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్‌ను సందర్శిస్తారు. ఈ చిత్రం ఓవర్సీస్ విడుదలను వాసారా చూసుకుంటోంది. అనంతరం ఇండియాకు తిరిగి రానున్న విష్ణు.. దేశంలోని పలు నగరాల్ని చుట్టి రానున్నారు.

ఇక ఈ చిత్రానికి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న తాను, ఇందులోని అనేక యాక్షన్ సన్నివేశాలను(Action scenes) స్వయంగా డిజైన్ చేసినట్లు చెప్పారు. తాను రూపొందించిన యాక్షన్ ఘట్టాలకు అద్భుతంగా ప్రాణం పోసిన స్టంట్ మాస్టర్ కెచ్చాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. “హర హర మహాదేవ్” (Hara Hara Mahadev) అంటూ తన ఆధ్యాత్మిక భావనను కూడా వ్యక్తం చేశారు.

త‌న సినిమాని ప్ర‌మోట్ చేసుకునే క్రమంలో మంచు విష్ణు Manchu Vishnu పెట్టిన పోస్ట్ కి వ‌చ్చిన స‌మ‌స్య ఏమి లేదు. కాని పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం జరుగుతున్న వేళ మంచు విష్ణు ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) గురించి స్పందించకుండా తన సినిమాకి సంబంధించిన పోస్ట్ పెట్టడంతో చాలామంది నెటిజన్లు మంచు విష్ణుని ట్రోల్ చేస్తున్నారు. నీకు దేశ భ‌క్తి లేదా,? ఆప‌రేష‌న్ సిందూర్ గురించి అంతా చ‌ర్చ న‌డుస్తున్న స‌మ‌యంలో నువ్వు ఇలాంటి పోస్ట్ పెట్టడం అవ‌స‌రమా..? రాళ్ళ‌తో కొడ‌తారు జాగ్ర‌త్త అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్(Netizens Comments) చేస్తున్నారు. సాధార‌ణంగా విష్ణు చేసే పోస్టులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువ‌గా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. కన్న‌ప్ప చిత్రం (Kannappa Movie) విష‌యానికి వ‌స్తే… జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా పలు భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది.