అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kannappa | టాలీవుడ్ హీరో విష్ణు మంచు తన కలల ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ‘కన్నప్ప’ సినిమా(Kannappa Movie) ఎట్టకేలకు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. మంచు విష్ణు ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. మొత్తంగా మాత్రం కన్నప్ప పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీతో సినిమా మలుపు తిరిగింది. మరోవైపు క్లైమాక్స్‌లో విష్ణు నటన ఆకట్టుకుంది, “విష్ణులో ఇంత యాక్టింగ్ టాలెంట్ ఉందా?” అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.. ఇలా కన్నప్ప మెల్లగా మౌత్ టాక్‌తో మంచి వసూళ్లే రాబడుతున్నట్టు తెలుస్తోంది.
Kannappa | పైరసీ పీడ
అయితే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా పైరసీ తొక్కేస్తుంది.. 30,000 పైరసీ లింకులు ఇప్పటివరకూ తొలగించామని టీమ్ వెల్లడించింది. ఈ విషయంపై విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ,“పైరసీ (Piracy)అంటే దొంగతనం. దయచేసి దాన్ని ప్రోత్సహించకండి. మన పిల్లలకు దొంగతనం నేర్పించం కదా, అలాంటప్పుడు పైరసీలో సినిమా చూడటం ఎందుకు?” అని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమ, పెట్టుబడి పెట్టాం. ఇలా పైరసీతో మా సినిమాను దెబ్బతీయడం దారుణం అని విష్ణు(Manchu Vishnu) అన్నారు. సినిమా పరిశ్రమను ఇబ్బందులు పైరసీని అరికట్టేందుకు ప్రేక్షకుల సహకారం చాలా అవసరం అని విష్ణు పేర్కొన్నారు. సినిమాని థియేటర్స్(Theaters)లో లేదంటే ఓటీటీలో మాత్రమే చూడాలని అన్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి హక్కులు అమ్మకుండా, సినిమా మీద నమ్మకంతో ముందుకెళ్లిన విష్ణు, ఇప్పుడు అదే నమ్మకాన్ని నిజం చేశాడు. సినిమా సక్సెస్ తర్వాత ఓటీటీ డీల్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. విష్ణు చెప్పిన రేటుకే డీల్ కుదురుతుందని సమాచారం. అంతేకాక, కన్నప్ప సినిమా ఓటీటీ(OTT)లోకి పది వారాల తరువాతే వస్తుందని విష్ణు గట్టి నమ్మకంతో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా ఆడుతున్న కన్నప్ప, ఇతర భాషలలో అంతగా ఆకట్టుకోలేకపోయిందని సమాచారం. తమిళం, కన్నడ, మలయాళంలో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.