అక్షరటుడే, వెబ్డెస్క్: Hero Vishal Marriage | గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో వార్తలలో నిలుస్తూ వచ్చిన విశాల్ (vishal) ఇప్పుడు పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అయ్యాడు. గత రెండు రోజులుగా విశాల్ పెళ్లి వార్తలు నెట్టింట ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఏ అమ్మాయిని విశాల్ వివాహం ఆడనున్నాడు అనే విషయంపై జనాలకి పెద్దగా క్లారిటీ లేదు. తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు విశాల్. నటి సాయి ధన్సికను (actress sai dhansika) వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో (chennai) నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న విశాల్ సాయి ధన్సికని ఆగస్టు 29న వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తుంది అని స్పష్టం చేశారు.
Hero Vishal Marriage | అమ్మాయి ఎవరంటే..
ఇక సాయి ధన్సిక (sai dhansika) మాట్లాడుతూ, కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తన మనసులోని మాటను పంచుకున్నారు. సాయి ధన్సిక నటించిన ‘యోగీ దా’ (‘yogi da’) అనే యాక్షన్ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారనే వార్త బయటకు రావడంతో వీరి పెళ్లిపై ప్రచారం మరింత ఊపందుకుంది. అందరు అనుకున్నట్లుగానే, అదే వేదికపై నుంచి విశాల్-ధన్సిక (vishal-dhansika) తమ పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించి, అభిమానులకు ఆనందాన్ని పంచారు. సాయి ధన్సిక, రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలో (kabali movie) కీలక పాత్ర పోషించడంతో పాటు, ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ వంటి తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
సాయి ధన్సిక (sai dhansika) ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇక విశాల్ విషయానికి వస్తే సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో (south industry) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘నడిగర్ సంఘం’ భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ భవనం పూర్తయిన సందర్భంగా మీడియాతో (media) మాట్లాడుతూ తనకి కాబోయే సతీమణిని అలానే పెళ్లి తేదిని ప్రకటించి అందరికి సర్ప్రైజ ఇచ్చారు.