అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vishakapatnam | సాగర తీరంలోని విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశగా మారబోతోంది. దాదాపు రూ. 88,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకు రావడం ఈ నగరానికి మరో మైలురాయి. ఈ పెట్టుబడుల కోసం అక్టోబర్ 14న ప్రభుత్వం, గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. దీంతో విశాఖ (Vishakapatnam) త్వరలోనే దేశానికి తలమానికంగా నిలిచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా అవతరించనుంది.
Vishakapatnam | ఐటీ హబ్‌గా విశాఖ
కేవలం గూగుల్ మాత్రమే కాదు, పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా విశాఖ వైపు దృష్టి సారించాయి. ఐటీ, డేటా సెంటర్లు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇప్పటికే పలు సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి.
- TCS – రూ. 1,370 కోట్లు
- కాగ్నిజెంట్ – రూ. 1,583 కోట్లు
- యాక్సెంచర్ – రూ. 1,200 కోట్లు
- ఏఎన్ఎస్ఆర్ – రూ. 1,000 కోట్లు
- సత్వ డెవలపర్స్ (Sattva Group) – రూ. 1,500 కోట్లు
- ఫీనమ్ – రూ. 207 కోట్లు
- పీపుల్ ఉర్సా – రూ. 5,278 కోట్లు
ఈ సంస్థలు తమ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో అమలు చేస్తే, విశాఖలో మరో హైటెక్ సిటీ రూపుదిద్దుకోవడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Vishakapatnam | ఐటీ నుంచి స్టీల్ ప్లాంట్ల వరకు పెట్టుబడులు
విశాఖపట్నం కేవలం ఐటీ హబ్‌గా (IT Hub) మాత్రమే కాకుండా స్టీల్ మరియు ఎనర్జీ రంగాల కేంద్రంగా కూడా ఎదుగుతోంది. అర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS) సంస్థ రాజయ్యపేట సమీపంలో రూ. 1.47 లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టులను నిర్మిస్తోంది.
ఎన్టీపీసీ (NTPC) పూడిమడక ప్రాంతంలో రూ. 1.85 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును స్థాపించడానికి సిద్ధమైంది.
మొత్తంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే విశాఖ పరిధిలో రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Vishakapatnam | రవాణా, మౌలిక వసతుల విస్తరణ
విశాఖ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేసింది. రాంబిల్లి న్యూక్లియర్ సబ్‌మెరైన్ బేస్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport), మూలపేట పోర్ట్, జీఎంఆర్ యూనివర్సిటీ, ఫార్మా పార్క్ ప్రాజెక్టులు.. ఇవి కాకుండా పర్యాటక రంగం అభివృద్ధికి స్టార్ హోటళ్ల నిర్మాణం, అలాగే మాస్టర్‌ప్లాన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కోస్టల్ కారిడార్, రైల్వే జోన్, మెట్రో రైలు ప్రాజెక్టు (Metro Rail Project)లు కూడా ప్రణాళికలో ఉన్నాయి.
Vishakapatnam | భవిష్యత్తులో “టెక్ & స్టీల్ సిటీ”
ఈ పెట్టుబడులతో విశాఖపట్నం త్వరలోనే దేశంలోనే అగ్రస్థాయి టెక్-స్టీల్ సిటీగా ఎదగనుంది. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు, పర్యాటకం వంటి అన్ని రంగాల్లో వేగంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రగతి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తును కొత్త దిశలోకి నడిపించనుంది.