HomeUncategorizedVisakhapatnam | విశాఖ అందాల‌ను చూసేందుకు త్వ‌ర‌లోనే డ‌బుల్ డెక్కర్ బ‌స్సులు..!

Visakhapatnam | విశాఖ అందాల‌ను చూసేందుకు త్వ‌ర‌లోనే డ‌బుల్ డెక్కర్ బ‌స్సులు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పర్యాటక రంగం క్ర‌మ‌ క్రమంగా అభివృద్ధి చెందుతుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఏపీలోని విశాఖపట్నం అయితే అందమైన బీచ్‌లతో, ప్రకృతి సౌందర్యంతో దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

రోజువారీగా వేలాది మంది పర్యాటకులు విశాఖను సందర్శిస్తున్న తరుణంలో, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధికారులు మరో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. నగరంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు (Electric Double Decker AC Buses) ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సముద్ర తీరాన్ని దగ్గరగా చూసే అరుదైన అవకాశం ఈ బస్సుల ద్వారా ప్రయాణికులకు లభించనుంది. బీచ్ రోడ్ వెంబడి పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తూ ఈ బస్సులు విశాఖ (Visakhapatnam) నగరానికి కొత్త ఆకర్షణగా మారనున్నాయి.

Visakhapatnam | త్వ‌ర‌లోనే అందుబాటులోకి..

ముంబై, గోవా, ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో విజయవంతంగా నడుస్తున్న ‘హాప్ ఆన్ – హాప్ ఆఫ్’ బస్సు సర్వీసులను ఇప్పుడు విశాఖలోనూ ప్రవేశపెడుతున్నారు. బీచ్ రోడ్ వెంట ఉన్న 20 ప్రధాన పర్యాటక ప్రదేశాలకు (20 Major Tourist Destinations) ఈ బస్సులు సేవలందించనున్నాయి. ప్రయాణికులు తమకు నచ్చిన స్టాప్ వద్ద దిగి, సందర్శన అనంతరం మళ్లీ అదే టికెట్‌తో ప్రయాణాన్ని కొనసాగించే సౌకర్యం ఉంటుంది. ఈ బస్సులు పూర్తిగా విద్యుత్‌తో నడిచే విధంగా రూపొందించబడ్డాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడడంలో ఇది ఓ కీలక అడుగుగా మారనుంది.

ప్రస్తుతం రెండు బస్సులు సిద్ధంగా ఉండగా, పర్యాటక శాఖ మంత్రి (Tourism Minister), ఇతర ఉన్నతాధికారులు ఇప్పటికే వీటిని పరిశీలించారు. డిమాండ్ పెరిగినట్టయితే మరిన్ని బస్సులను సేవల్లోకి తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ ధరలు, ఆన్‌లైన్ బుకింగ్, రూట్ మ్యాప్, టైమింగ్స్ వంటి వివరాలను అధికారులే త్వరలో వెల్లడించనున్నారు. ఒకసారి టికెట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ రోజు అంతా ప్రయాణికులు ఎక్కడైనా ఎక్కి దిగే సౌలభ్యం పొందనున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల పైఅంతస్తు ఓపెన్ డెక్‌గా ఉండడంతో, పర్యాటకులు సముద్రతీరాన్ని శీతల గాలిలో ఆస్వాదించే అవకాశం పొందుతారు. కూర్చోవడానికి సౌకర్యవంతమైన సీట్లు, ఎయిర్ కండిషనింగ్ వసతి ద్వారా ప్రయాణ అనుభవం మరింత ఆనందదాయకంగా మారనుంది. కైలాసగిరి, రుషికొండ బీచ్, ఏరీస్ హిల్, సబ్‌మెరైన్ మ్యూజియం వంటి విశాఖ ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలు ఈ టూర్‌లో భాగమవుతాయి. వాటిని ఒకే రోజు, ఒకే టికెట్‌తో సందర్శించుకునే ఈ సదుపాయం పర్యాటకులకు గొప్ప అనుభవాన్ని కలిగించనుంది.