HomeUncategorizedAbu Dhabi | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ–అబుదాబి విమాన సర్వీస్​ ప్రారంభం

Abu Dhabi | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ–అబుదాబి విమాన సర్వీస్​ ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Abu Dhabi | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లోని ప్రజలకు ఇండిగో(Indigo) విమాన సంస్థ గుడ్​న్యూస్​ చెప్పింది.

విశాఖపట్నం నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి (Vizag – Abu Dhabi) నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది. ఈ ఫ్లైట్​ విశాఖపట్నం, ఒడిశాలోని భువనేశ్వర్​ మీదుగా అబుదాబి వెళ్లనుంది. ఫలితంగా దుబాయ్ వెళ్లే వారికి మంచి వెసులుబాటు కలగనుంది. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వైజాగ్ సహా చుట్టు పక్కల జిల్లాల నుంచి వేలాది మంది యూఏఈకి వెళ్తుంటారు. అలాంటి వారందరికీ ఇది శుభవార్తే.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​ నుంచి అబుదాబికి డైరెక్ట్​ ఫ్లైట్​ సర్వీసులు లేవు. దీంతో అబుదాబి వెళ్లాల్సిన ఏపీ వాసులు హైదరాబాద్ (Hyderabad)​, బెంగళూరు (Bangaluru), చెన్నై మీదుగా వెళ్తున్నారు. తాజాగా ఇండిగో విమాన సంస్థ అబుదాబికి డైరెక్ట్​ ఫ్లైట్​ సర్వీసులను ప్రారంభించింది. జూన్ 13 నుంచి విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.