అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flight Passengers | బాలి నుంచి బ్రిస్బేన్‌కు (Bali to Brisbane) వెళ్లే వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో Flight ప్రయాణికులు ఊహించని అవస్థలు పడ్డారు. విమానంలో టాయిలెట్లు పాడు కావడంతో, ఆరు గంటల ప్రయాణంలో చివరి మూడు గంటలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసౌకర్యం ఏ స్థాయికి వెళ్లిందంటే, సిబ్బందే ప్రయాణికులకు ఖాళీ వాటర్ బాటిల్స్ అందించి, వాటితోనే పని కానివ్వమని సూచించాల్సి వచ్చింది.
Flight Passengers | మూడు గంటల నరకం..
గత గురువారం బాలి (డెన్ పసర్) నుంచి బయలుదేరిన బోయింగ్ విమానం (Boeing flight), బ్రిస్బేన్‌కు వెళ్తుండగా మొదటి మూడు గంటల వరకూ ప్రయాణం సాఫీగా సాగింది. కానీ, ఆ తర్వాత టాయిలెట్లు పనిచేయకుండా పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
విమానం భూమిపై ల్యాండ్ అయ్యేలోపు మిగతా మూడు గంటలు వాళ్లు టాయిలెట్ (Toilet) లేకుండా కాలం గడపాల్సి వచ్చింది. ప్రమాదం తలెత్తకుండా, ఎలాగైనా పరిస్థితిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండటంతో, ఎయిర్ హోస్టెస్‌లు ప్రయాణికులకు ఖాళీ వాటర్ బాటిల్స్ అందించి అవే ఉపయోగించాలంటూ సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ప్రయాణికులు వాటిని ఉపయోగించారు.
అయితే, ఈ సమయంలో కొంతమంది వృద్ధులు దుస్తుల్లో టాయ్‌లెట్‌కు వెళ్లడంతో విమానం అంతా దుర్గంధం వ్యాపించింది. ఈ ఘటనపై విమాన సంస్థ క్షమాపణలు చెప్పడంతో పాటు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. వర్జిన్ ఆస్ట్రేలియా (Virgin Australia officially) అధికారికంగా స్పందిస్తూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ఇదొక అనుకోని పరిస్థితి. అయినా కూడా మా సిబ్బంది తెలివిగా స్పందించి పరిస్థితిని హ్యాండిల్ చేశారు” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, ఈ సంక్షోభ సమయంలో కూల్‌గా వ్యవహరించిన తమ క్రూ మెంబర్లకు అభినందనలు కూడా తెలిపింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వెలువడుతోంది.