అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL | రాజస్థాన్ రాయల్స్ RR చిచ్చర పిడుగు, ఐపీఎల్ IPL యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి Vaibhav Suryavanshi టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ Virender Sehwag విలువైన సలహా ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో వచ్చే పొగడ్తలకు పొంగిపోవద్దని సూచించాడు. ఒకటి, రెండు ఇన్నింగ్స్‌లకే సంతోష పడితే.. వచ్చే ఏడాదే కనిపించకుండా పోతావని హెచ్చరించాడు. సుదీర్ఘ కాలం క్రికెట్ cricket ఆడాలనే లక్ష్యం పెట్టుకోవాలని సూర్యవంశీకి సలహా ఇచ్చాడు.
సంజూ శాంసన్ Sanju Samson గైర్హాజరీలో రాజస్థాన్ రాయల్స్ తరఫున లక్నో సూపర్ జెయింట్స్ LSGతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన 14 ఏళ్ల సూర్యవంశీ.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆర్‌సీబీ RCBతో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ భువనేశ్వర్ కుమార్ Bhuvneshwar Kumar బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఫియర్‌లెస్ అప్రోచ్‌తో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అయిన సెహ్వాగ్.. పలు సూచనలు చేశాడు.
‘వైభవ్ సూర్యవంశీ మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగాలనే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ విషయంలో విరాట్ కోహ్లీ Virat Kohliని స్ఫూర్తిగా తీసుకోవాలి. విరాట్ కోహ్లీ 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడటం ప్రారంభించాడు. ఇప్పటికీ 18 సీజన్లు ఆడాడు. వైభవ్ అతన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఈ ఒక్క సీజన్‌కే సంతృప్తి చెందితే మాత్రం వచ్చే సీజన్‌కే కనుమరుగవుతాడు.
క్రికెట్‌లో బాగా ఆడినప్పుడు అందరూ మెచ్చుకుంటారు. కానీ విఫలమైతే మెచ్చుకున్నవారే తిడుతారు. గతంలో కొందరు ఆటగాళ్లు ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడగానే వచ్చిన ప్రశంసలను నెత్తికి ఎక్కించుకొని కనుమరగయ్యారు. వైభవ్ ఇప్పుడే స్టార్ క్రికెటర్‌గా ఫీల్ అవ్వద్దు.’అని సెహ్వాగ్ సూచించాడు.