ePaper
More
    Homeక్రీడలుVirat Kohli retirement రిటైర్మెంట్ ప్రకటించినా.. కోహ్లీ ఆదాయం రెట్టింపు!

    Virat Kohli retirement రిటైర్మెంట్ ప్రకటించినా.. కోహ్లీ ఆదాయం రెట్టింపు!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virat Kohli retirement టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాకుండా అతని ఆదాయం 29 శాతం పెరిగింది. వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ అయిన కోహ్లీ ప్రస్తుత నెట్‌వర్త్ నివేదికల ప్రకారం రూ. 1050 కోట్లుగా ఉంది. ప్రపంచంలోనే మరే క్రికెటర్‌కు కూడా ఇంత నెట్‌వర్త్ లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కూడా కోహ్లీ తర్వాతే. వరల్డ్ రిచెస్ట్ టాప్-5 క్రీడాకారుల్లో కోహ్లీ ఒకడు.

    ప్రస్తుతం విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ లెక్కన అతనికి ఏడాదికి రూ. 7 కోట్ల జీతం వస్తుంది. మ్యాచ్ ఫీజులు అదనం. టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజులను కోహ్లీ అందుకుంటున్నాడు.

    అంతేకాకుండా విరాట్ కోహ్లీ 2008 నుంచి ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 12లక్షలతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన కోహ్లీ.. ఇప్పుడు రూ. 21 కోట్ల వేతనాన్ని స్వీకరిస్తున్నాడు.

    18 ఏళ్ల‌లో ఐపీఎల్ ద్వారానే అతను రూ. 212 కోట్లు ఆర్జించాడు. ఈ ఆదాయం కాకుండా విరాట్ కోహ్లీ అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. సొంతంగా కొన్ని కంపెనీలను కూడా నిర్వహిస్తున్నాడు.

    కోహ్లీ బ్లూ స్టార్, ఎమ్ఆర్‌ఎఫ్, పూమా వంటి తదితర కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు.. డిజిట్ ఇన్సూరెన్స్‌, బ్లూ ట్రైబ్, వ్రాగన్, చిసెల్ ఫిట్‌‌నెస్, వన్8 అనే కంపెనీలను నెలకొల్పాడు. ప్రస్తుతం క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీకి మరింత సమయం దొరకనుంది.

    ఈ ఖాళీ సమయాన్ని అతను తన వ్యాపార విస్తరణకు వాడుకోవచ్చు. ఇతర కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించవచ్చు. Sport Convo, Hyperice, Universal Sportsbiz Pvt. Ltd. (USPL), Galactus Funware Technology Pvt. Ltd, Agilitas, O’cean Beverages వంటి కంపెనీల్లోనూ కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు.

    Latest articles

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    More like this