Homeక్రీడలుRo-Ko Retirement | రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు వీడ్కోలు .. బీసీసీఐ వైస్...

Ro-Ko Retirement | రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు వీడ్కోలు .. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ క్లారిటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ro-Ko Retirement | టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు గురించి గ‌త కొద్ది రోజులుగా ఫ్యాన్స్, క్రికెట్ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌కు (2027 ODI World Cup) వీరిద్దరూ ఆడతారా? లేదా అంతకుముందే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారా? అనే ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా (BCCI Vice President Rajeev Shukla) ఈ విషయమై స్పందించారు. “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా రిటైర్ కాలేదు. ఇద్దరూ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికీ రాణిస్తున్నారు. అలాంటప్పుడు వారి రిటైర్మెంట్ గురించి ఇప్పుడే ఎందుకు చర్చిస్తున్నారు?” అని శుక్లా ప్రశ్నించారు.

Ro-Ko Retirement | అస‌లు క్లారిటీ ఇదే..

‘‘మేము ఎప్పటికీ ఆటగాళ్లను రిటైర్మెంట్ తీసుకోమని ఒత్తిడి చేయం. అది వారి వ్యక్తిగత నిర్ణయం. వారు ఎప్పుడైతే తాము ఫిట్‌గా లేమనుకుంటారో, అప్పుడే నిర్ణయం తీసుకుంటారు” అని వివరించారు. ఒక అభిమాని రోహిత్, కోహ్లీల ఫేర్‌వెల్ మ్యాచ్ (Rohit and Kohli farewell Match) గురించి అడగ్గా, శుక్లా స్పందిస్తూ.. ఫేర్‌వెల్ గురించి ఇప్పుడు మాట్లాడటానికి సమయం కాదు. వారు ఇంకా ఆటని కొన‌సాగిస్తున్నారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారు. మీరు ఇప్పటి నుంచే వీడ్కోలు మ్యాచుల గురించి ఆలోచించడం అవసరం లేదు” అని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ, రోహిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ఇచ్చారు. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే సిరీస్ కోసం ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ వన్డేల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వీడ్కోలు గురించి ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అభిమానులు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌ల రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma), విరాట్ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ కాగా, అవి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. వీరిని ఎప్పుడెప్పుడు గ్రౌండ్‌లో చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.