HomeUncategorizedKohli - Rohit | ఐసీసీ పొర‌పాటు.. రోహిత్‌, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ విష‌యంలో క‌న్ఫ్యూజ‌న్

Kohli – Rohit | ఐసీసీ పొర‌పాటు.. రోహిత్‌, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ విష‌యంలో క‌న్ఫ్యూజ‌న్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kohli – Rohit | భారత క్రికెట్ అభిమానులను (Indian cricket fans) ఈ వార్త అయోమ‌యానికి గురి చేసింది.. వన్డే క్రికెట్‌కు చక్కటి సేవలందిస్తున్న భారత జట్టు సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు రోహిత్ శర్మల (Rohith Sharma) పేర్లు తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి అకస్మాత్తుగా మాయ‌మ‌వ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది.

బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఈ ఇద్దరి పేర్లు టాప్-10లోనే కాదు, టాప్-100లో కూడా లేకపోవడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో చర్చలు జరిగాయి. క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ (38) మరియు కోహ్లీ (36) వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో, ఒక్కసారిగా వారి పేర్లు గల్లంతవ్వడం పలు ఊహాగానాలకు దారి తీసింది.

Kohli – Rohit | టెన్షన్ ప‌డ్డారు..

కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ (Kohli – Rohit retirement) ప్ర‌క‌టించ‌బోతున్నారా? “ఈ వార్తలు నిజమైతే మేము త‌ట్టుకోలేము అంటూ అభిమానులు ట్వీట్లు పెడుతూ తమ‌ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే, ఈ గందరగోళానికి ముగింపు పలుకుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టతనిచ్చింది. ఐసీసీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. “ఈ వారం ర్యాంకింగ్స్ అప్డేట్ సమయంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటిని ఇప్పుడే పరిష్కరిస్తున్నాం. ప్లేయర్ల అసలు ర్యాంకులు తిరిగి అప్‌డేట్ అవుతాయి అని చెప్పారు. అన్న‌ట్లే కొన్ని గంటల తర్వాత విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ (Rohit Sharma) ర్యాంకులు తిరిగి వారి మునుపటి స్థానాల్లోకి చేరాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత విజయానికి ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు కీలకంగా నిలిచారు. తమ అనుభవంతో, అద్భుతమైన ప్రదర్శనతో జట్టుని గెలుపు తీరాలు చేర్చారు. వన్డే ఫార్మాట్‌లో (ODI Format) ఈ ఇద్దరికి ఉన్న రికార్డులు ప్రత్యేకమైనవే. వీరిద్దరూ త్వరలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సహా భవిష్యత్ టోర్నీల్లోనూ జట్టులో కొనసాగనున్నారు. రోహిత్ నాయ‌క‌త్వంలో భార‌త్‌కి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ద‌క్కాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ప్ర‌క‌టించొద్ద‌ని అభిమానులు కోరుతున్నారు.