HomeతెలంగాణKohli Restaurant | హైద‌రాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌.. సీజ‌న్‌ని బ‌ట్టి వెరైటీస్

Kohli Restaurant | హైద‌రాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌.. సీజ‌న్‌ని బ‌ట్టి వెరైటీస్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kohli Restaurant | సినిమా వాళ్లు, క్రికెట‌ర్స్ ఎంత సంపాదించినా కూడా బిజినెస్‌ల‌లో Business పెట్టుబ‌డులు పెడుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రీడారంగంలోనే కాక వ్యాపార రంగంలోనూ రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే కోహ్లీ వన్ 8 బ్రాండ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్ పుమాతో కలిశాక వారి మార్కెట్ వ్యాల్యూ మ‌రింత పెరిగింది. అంతటి క్రేజ్ ఉన్న విరాట్ కొహ్లీ రెస్టారెంట్ బిజినెస్​లో కూడా అదే తరహాలో దూసుకుపోతున్నారు. విరాట్ కోహ్లీ ‘వన్ 8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లను వివిధ నగరాల్లో తెరుస్తున్నారు. ఇప్పటికే ఈ రెస్టారెంట్లు బెంగళూరు, ముంబయి, పుణె, కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో ఉన్నాయి.

Kohli Restaurant | వెరైటీ వంట‌కాలు..

ఇటీవ‌ల వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ (One 8 commune restaurant) హైదరాబాద్ కు చేరింది. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో హార్డ్ రాక్ కేఫ్ దగ్గరలో ఈ వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. ఆర్ఎంజడ్ ది లాఫ్ట్‌ లో ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇందులో టేబుల్స్ రిజర్వ్ చేసుకోవడం కోసం.. 9559071818, 9559081818 ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలని కూడా కోహ్లీ సూచించారు. ఇది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కావడంతో దానిని చూసేందుకు అనేక మంది వెళ్తున్నారు. ఈ రెస్టారెంట్​లో దేశీ వంటకాలతోపాటు విదేశీ వంటకాలను కూడా వడ్డించనున్నట్లు తెలుస్తోంది. వన్ 8 కమ్యూనల్ రెస్టారెంట్‌లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని కోహ్లీ వెల్లడించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని తెలిపారు. కోహ్లీకి మష్రూమ్ డిమ్ సమ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. అది కూడా అక్క‌డ దొరికే అవ‌కాశం ఉంది.

సీజ‌న్‌కి తగ్గ‌ట్టుగా అక్క‌డ అనేక వెరైటీలు వ‌డ్డించ‌నున్నార‌ట‌. ఇక్కడ విరాట్ కోహ్లీ Virat Kohli జెర్సీతో పాటు దానిపై ఆయ‌న సైన్ కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది. వెరైటీ ఫేవ‌రెట్ ఫుడ్‌కి సంబంధించి స‌ప‌రేట్ సెక్ష‌నే ఉంది. ఇక ఆల్క‌హాల్‌కి సంబంధించి కూడా ఒక సెక్ష‌న్ ఉంది. మొత్తానికి విరాట్ రెస్టారెంట్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోందనే చెప్పాలి.