Virat Kohli
Virat Kohli | గెలుపు త‌ర్వాత విరాట్ కోహ్లీ కంట క‌న్నీరు.. ఓదార్చిన ఆగ‌ని దుఃఖం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli | 17 ఏళ్లుగా ఆర్సీబీ(RCB)తో ఉన్న విరాట్ కోహ్లీ ఇంత వ‌ర‌కు క‌ప్ అందుకోలేదు. ఎట్ట‌కేల‌కి విరాట్ కోహ్లీ (Virat Kohli) కల నెరవేరింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి.. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) జట్టులోనే ఉన్న కోహ్లీ, 17 సీజన్లుగా ఒక్కసారి కూడా ట్రోఫీ(Trophy)ని అందించలేకపోయాడు. అయినా సరే.. ఫ్యాన్స్ మాత్రం RCBని, విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వారందరి కోసమైనా.. ఐపీఎల్(IPL) కప్పు కొట్టాలని కోహ్లీ ప్రతిసారి అంటూనే ఉంటాడు. కానీ 17 సంవత్సరాలుగా ఓడిపోతూ వస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.

Virat Kohli | క‌న్నీరు పెట్టుకున్న కోహ్లీ..

ఈ మ్యాచ్‌లో, ఆర్‌సిబి(RCB) ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Super Kings) 20 ఓవర్లలో 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. 18 ఏళ్లు.. దాదాపు 18 ఏళ్లు.. గెలిచినా, ఓడినా ఒక జట్టునే సపోర్ట్ చేస్తూ వస్తున్న ఫ్యాన్స్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. తోటి ఆట‌గాళ్లు ఓదారుస్తున్నా కూడా కోహ్లీ కంట క‌న్నీరు ఆగ‌లేదు. అనుష్కని (Anushka) కూడా హ‌గ్ చేసుకొని విరాట్ కోహ్లీ క‌న్నీరు కార్చారు.

ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ 10 సార్లు ప్లేఆఫ్‌(Play Off)కు వెళ్లింది. ఆ పదిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, కప్పు గెలవలేకపోయింది. ఇప్పుడు నాలుగో సారి ఫైనల్‌కు చేరుకుంది. అభిమానులతో యావత్ కర్ణాటక రాష్ట్రం గర్వపడేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి కప్ కొట్టింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి(Karnataka Chief Minister) సైతం సంతోషం వ్యక్తం చేశారు.ఇది ఐపీఎల్ (IPL 2025) కప్పే కదా అని అనుకునే వారికి ఇది అర్థం కాకపోవచ్చు. ఇది క్రికెట్ గురించో, ఐపీఎల్ గురించో కాదు.. ఒక వ్యక్తిని, ఒక టీమ్‌ను నమ్మి కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతి ఏడాది సపోర్ట్ చేస్తూనే ఉండ‌డం, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అంతమంది నమ్మకాన్ని 18 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్నాడు కాబ‌ట్టే విరాట్ అంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..