అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం లండన్‌లో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ జంట తాజాగా లండన్ వీధుల్లో(London Streets) నడుస్తూ, అక్కడి స్థానికులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో విరాట్ తన ఒక చేతిలో గొడుగు(Umbrella), మరొక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని కనిపించాడు. అనుష్క శర్మ ఆకుపచ్చ రంగు హ్యాండ్‌బ్యాగ్ ధరించి కనిపించింది. వీరిద్దరూ ఒక విదేశీ యువకుడు, యువతితో చక్కగా మాట్లాడుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంభాషణ మధ్య ఇద్దరూ నవ్వుతూ, ఆనందంగా సమయాన్ని గడుపుతున్నట్లు వీడియో స్పష్టంగా చూపిస్తోంది.
Virat Kohli | సామాన్యుల మాదిరిగా..
ఈ వీడియో చూసిన అభిమానులు, వీరి పిల్లలు వామికా మరియు అకాయ్‌తో కలిసి కుటుంబ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నారు. కోహ్లీ, అనుష్క (Anushka Sharma) మధ్య ఉండే కెమిస్ట్రీ, చిల్లింగ్ మూడ్‌లో వీరిద్దరూ పబ్లిక్‌లో ఇలా కనిపించడంపై అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే విరాట్ చేతిలో గొడుగు, వాటర్ బాటిల్ చూసిన నెటిజన్స్ కోహ్లీ(Virat Kohli)కి బాధ్యతలు బాగానే పెరిగాయని కామెంట్ చేస్తున్నారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన పెళ్లైతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మోయక తప్పదు. ఇక ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కనిపించలేదు. చివరిసారిగా భారత్ తరఫున ఆయన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో బరిలోకి దిగాడు. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, ప్రస్తుతం గ్యాప్ తీసుకుని కుటుంబంతో టైం స్పెండ్ చేస్తున్నాడు.
భారత జట్టు తన తదుపరి వన్డే సిరీస్‌ను అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 19న జరగనున్న మొదటి వన్డేలో విరాట్ మళ్లీ బ్లూ జెర్సీలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కోహ్లీ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం మనం చూశాం. కోహ్లీని తిరిగి గ్రౌండ్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.