ePaper
More
    Homeఅంతర్జాతీయంAnakonda Snake | ఒళ్లు గగుర్పొడిచేలా అమెజాన్ అడ‌వుల్లో అన‌కొండ‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Anakonda Snake | ఒళ్లు గగుర్పొడిచేలా అమెజాన్ అడ‌వుల్లో అన‌కొండ‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anakonda Snake | అనకొండ Anakonda అనే పేరు వినగానే మనకు ముందుగా మ‌న ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. అన‌కొండ అనేది భారీ సర్పం కాగా, అనకొండలో కూడా అనేక జాతులు ఉన్నాయి. ఇవి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. 2024లో శాస్త్రవేత్తలు అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌(Amazon Rain Forest)లో ఒక కొత్త జాతి జెయింట్ అనకొండను గుర్తించ‌గా, గతంలో ఎప్పుడూ చూడని ఈ జాతి. అనకొండలు ప్రపంచంలోనే అతిపెద్దవి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అనకొండలు 24 అడుగుల పొడవు కంటే భారీగా పెరుగుతాయని కొంతమంది వౌరానీ(Waurani)లు పేర్కొంటున్నారు. అన‌కొండలు మనుషులను కరవడం కాదు.. ఏకంగా ఒక్క గుట్కతో మింగేస్తాయి కూడా.

    Anakonda Snake | ఎంత పెద్ద పాము..

    అనకొండ విశ్వరూపాన్ని చూపిస్తూ చాలా హాలీవుడ్‌ Hollywood సినిమాలు కూడా వచ్చేశాయి. అలాంటి అనకొండ నిజంగానే మన కళ్లముందు కనపడితే గుండె ప‌గిలిపోతుంది. ఈ భూమి మీద అతిపెద్ద అనకొండగా భావించే ఓ భారీ పామును ఇటీవల ఈక్వెడార్‌(Ecuador)లో కనిపించింది. తాజాగా అమెజాన్ అడవుల్లోనూ మరో భారీ అనకొండను గుర్తించారు. అమెజాన్ అడవుల మధ్యనున్న నదిలో ఆ అనకొండ ఈదుకుంటూ వెళ్తోంది. @Sheetal2242 అనే మహిళ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను హెలీకాఫ్టర్ నుంచి చిత్రీకరించారు. అమెజాన్ అడవుల మధ్యనున్న నదిలో ఆ అనకొండ ఈదుకుంటూ వెళ్తోంది.

    దూరం నుంచి చూస్తుంటేనే ఆ అనకొండ చాలా భారీగా కనిపిస్తోంది. అది వేగంగా నీటిపై ఈదుకుంటూ వెళ్తోంది. దాని భారీ ఆకారాన్ని చూస్తే ఎంతటి వారైనా భయపడి తీరాల్సిందే. ఈ వీడియోను చూసిన వారందరూ నోరెళ్ల‌బెడుతున్నారు. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8.3 లక్షల మందికి పైగా వీక్షించారు. 13 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అద్భుతమైన వీడియో అని ఒకరు, ఇది అత్యంత భారీ అనకొండలా ఉందని ఇంకొకరు, హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉందని మరొకరు కామెంట్ చేశారు.ఈ వీడియోపై నెటిజన్స్ మధ్య భిన్న వాదనలు జరుగుతున్నాయి. ఇది ఫేక్ వీడియో Fake videoకావొచ్చని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

    More like this

    Banswada | సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​...

    Yellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు (Yellareddy Police)...

    BC bills | బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోంది..: మంత్రి సీతక్క

    అక్షరటుడే, కామారెడ్డి: BC bills | రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని...